మరింత ప్రసారం కావాలి: హర్మన్‌ప్రీత్‌

మరింత ప్రసారం కావాలి: హర్మన్‌ప్రీత్‌

మైసూరు: భారత పురుషుల క్రికెట్‌ జట్టుతో  పాటే తమ మ్యాచ్‌లను కూడా మరింత ఎక్కువగా టీవీల్లో ప్రసారం చేస్తే బావుంటుందని భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది. ‘ప్రపంచకప్‌ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే చాలా మ్యాచ్‌లు టీవీల్లో ప్రత్యక్షంగా చూసి మా ఆటతీరును గమనించారు.

ఒకవేళ మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఇలాగే టీవీల్లో చూపిస్తే అసలు మేం ఎలా ఆడుతున్నామో అభిమానులకు తెలుస్తుంది. ప్రపంచకప్‌కు ముందు మేం చాలా టోర్నీలను గెలిచాం. కానీ అవేవీ టీవీల్లో రాలేదు కాబట్టి అభిమానులకు తెలీదు. ఇప్పుడు వారు కూడా మా ఆటను మరింతగా చూడాలనుకుంటున్నారు’ అని హర్మన్‌ప్రీత్‌ తెలిపింది. 

Back to Top