ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపే పుల్వామా అమరులకు నివాళి 

Mohammed Shami wants to win Australia ODI series for Pulwama martyrs - Sakshi

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు టీమిండియా పేసర్‌ షమీ కొంత మొత్తం నగదును   విరాళంగా ప్రకటించాడు. ‘మేం దేశం కోసం ఆడుతున్నాం. వారు దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టు ఎల్లవేళలా సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుంది’ అని షమీ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో రానున్న్ల సిరీస్‌లో విజయం సాధించి అమర జవాన్లకు అంకితం ఇవ్వాలని  సూచించాడు. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ ఏం నిర్ణయిస్తే టీమిండియా వాటినే అనుసరిస్తుందని పేర్కొన్నాడు.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top