ఆస్ట్రేలియాలోనే ఉండిపోతాం 

Missing athletes and coach face deportation from Australia - Sakshi

కామన్వెల్త్‌ క్రీడల అదృశ్య అథ్లెట్లు   

సిడ్నీ: గత నెలలో గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చి అదృశ్యమైన పలువురు ఆఫ్రికా దేశాల అథ్లెట్లు... తాము ఆస్ట్రేలియాలోనే స్థిరపడతామంటున్నారు. వీరి వీసా గడువు మంగళవారంతో ముగియడంతో బలవంతంగా దేశం నుంచి పంపిస్తామని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్‌ డట్టన్‌ హెచ్చరించారు.

దీంతో క్రీడాకారులంతా సిడ్నీలోని రెఫ్యూజీ అడ్వైజ్‌ అండ్‌ కేస్‌ వర్క్‌ సర్వీస్‌ (ఆర్‌ఏసీఎస్‌) అనే సంస్థను ఆశ్రయించారు. వీరిలో కామెరూన్, రువాండా, ఉగాండా దేశాలకు చెందిన వారున్నట్లు తెలుస్తోంది. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారించి నిర్ణయం తీసుకుంటామని ఆర్‌ఏసీఎస్‌ న్యాయవాది డేల్‌ తెలిపారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top