ఫిఫా అధ్యక్ష రేసులో ఎనిమిది మంది
లాసానే: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఫిఫా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఈ పీఠాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సెప్ బ్లాటర్ నిష్ర్కమణ అనంతరం కొత్త బాస్ ఎంపిక ఫిబ్రవరి 26న జరుగనుంది. సోమవారం రాత్రి నామినేషన్లకు తుది గడువు ముగియగా పోటీలో ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు.
మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్), టోక్యో సెక్స్వాలే (దక్షిణాఫ్రికా), షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా (బహ్రెయిన్), జెరోమ్ షాంపేన్ (ఫ్రాన్స్), గియాని ఇన్ఫాంటినో (స్విట్జర్లాండ్), ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్ (జోర్డాన్), డేవిడ్ నఖీద్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), మూసా బిలీటి (లైబీరియా) ఉన్నారు. వీరిలో టోక్యో సెక్స్వాలే, షేక్ సల్మాన్, ఇన్ఫాంటినో మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి.