తండ్రిని మించిపోయేలా ఉన్నాడు!

Mateo Messi Mimicking Fathers Iconic Goal Celebration - Sakshi

బ్యూనోస్‌ ఎయిర్స్‌:  అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో మెస్సీ ఒక దిగ్గజ ఆటగాడు. తన ఫ్రొఫెషనల్‌ కెరీర్‌లో 600కు పైగా గోల్స్‌ సాధించి తనదైన ముద్ర వేశాడు మెస్సీ. తన సీనియర్‌ కెరీర్‌ స్థాయిలో మెస్సీ  689 గోల్స్‌ సాధించాడు. అయితే ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచడంలో మెస్సీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే బాటలో మెస్సీ నాలుగేళ్ల కుమారుడు మాటియో అందిపుచ్చుకోవడానికి అప్పుడే యత్నాలు మొదలు పెట్టిసినట్లే కనబడుతున్నాడు.

ఇటీవల మాటియో పుట్టినరోజు సందర్భంగా ఆ బుడతడు కొట్టిన గోల్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. వీక్షకుల్ని కట్టి పడేస్తున్న ఆ వీడియోను మెస్సీ భార్య అంటోనెల్లా రోక్యూజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది పోస్ట్‌ చేసిన కాసేపట్లోనే వైరల్‌గా మారిపోయింది. ‘ తండ్రిని మించి పోయేలా ఉన్నాడు’ అని ఒకరు కామెంట్‌ చేయగా, ‘మెస్సీ కొడుకదా.. రక్తం ఎక్కడికి పోతుంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఫ్రీ కిక్‌ కొట్టడంలో  మెస్సీని ఫాలో అవడమే కాదు.... స్టైల్‌లో కూడా మెస్సీని అనుకరించడంతో అది మరి కాస్త ఆకర్షణీయంగా మారింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top