‘విరాట్‌’ బ్రాండ్‌ 

Kohli Once Again India's Most Valuable Celebrity Brand Icon - Sakshi

సెలబ్రిటీ ర్యాంకింగ్స్‌లో కోహ్లికి మళ్లీ అగ్రస్థానం

రెండో స్థానానికి బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌  

ముంబై: క్రికెట్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్‌న్‌ విరాట్‌ కోహ్లి.. తాజాగా సెలబ్రిటీ బ్రాండ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి బ్రాండ్‌ విలువను 237.5 మిలియన్‌ డాలర్లుగా (రూ. 1691 కోట్లు) కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ లెక్కగట్టింది. 2019కి సంబంధించి బుధవారం విడుదల చేసిన వాల్యుయేషన్‌ నివేదికలో 104.5 మిలియన్‌ డాలర్ల విలువతో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె 93.5 మిలియన్‌ డాలర్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. (ఇక్కడ చదవండి: కోహ్లి ‘వీక్‌’ పాయింట్‌ అదేనా?)

ఆమె భర్త, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కూడా మూడో స్థానంలోనే ఉండటం గమనార్హం. షారుఖ్‌ ఖాన్‌ అయిదో స్థానంలో (66.1 మిలియన్‌ డాలర్లు), సల్మాన్‌ ఖాన్‌ ఆరో స్థానంలో (55.7 మిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్నారు. ఆమిర్‌ ఖాన్‌ బ్రాండ్‌ వాల్యూ 11వ స్థానం నుంచి 16వ స్థానానికి (24.9 మిలియన్‌ డాలర్లు) పడిపోయింది. అటు అమితాబ్‌ బచ్చన్‌ ర్యాంక్‌ కూడా ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి (42.5 మిలియన్‌ డాలర్లు) తగ్గగా, ఆలియా భట్‌ ఏడో స్థానానికి (4.58 మిలియన్‌ డాలర్లు) చేరింది. ఇతర క్రీడాకారులలో ధోని 9వ (41.2), సచిన్‌ 15వ (25.1), రోహిత్‌ శర్మ 20వ (23.0) స్థానాల్లో ఉన్నారు. టాప్‌–20లో కొత్తగా నటులు ఆయుష్మాన్‌ ఖురానా, టైగర్‌ ష్రాఫ్‌ కూడా చేరాడు. క్రికెట్, సినిమాలకు సంబంధించిన 20 సెలబ్రిటీ బ్రాండ్స్‌ విలువ 1.1 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుందని అంచనా.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top