రహానే మళ్లీ మెరిశాడు..

Kohli And Rahane Fifties Put India In Drivers Seat - Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(51 బ్యాటింగ్‌), వైస్‌ కెప్టెన్‌(53 బ్యాటింగ్‌)లు రాణించడంతో మ్యాచ్‌పై భారత్‌కు పట్టు దొరికింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలతో అజేయంగా నిలవడంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. దాంతో కోహ్లి గ్యాంగ్‌ 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.  ఆదివారం మొత్తం భారత్‌ జట్టు బ్యాటింగ్‌ను కొనసాగిస్తే భారీ లక్ష్యాన్ని విండీస్‌ ముందు ఉంచవచ్చు.

81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో కోహ్లి, రహానేలు ఆదుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడి వందకు పైగా పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్‌ గాడిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో మెరిసిన రహానే.. మరోసారి ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లి చక్కటి సహకారం అందిస్తూ పరిస్థితిని చక్కదిద్దాడు.  కేఎల్‌ రాహుల్‌(38) ఫర్వాలేదనిపించగా, మయాంక్‌ అగర్వాల్‌(16), పుజారా(25)లు నిరాశ పరిచారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 297 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 185/3

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 222 ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top