క్లాసెన్‌ వచ్చేశాడు..

Klaasen replaces Darcy Short for Rajasthan Royals - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే తొలుత ధోని సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ చెన్నై-రాజస్తాన్‌లు తలో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.  

ఇదిలా ఉంచితే, దక్షిణాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. డీ ఆర్సీ స్థానంలో క్లాసెన్‌కు అవకాశం కల్పించారు. ఇక ధావన్‌ కులకర్ణి స్థానంలో స్టువర్ట్‌ బిన్నీని తీసుకున్నారు. మరొకవైపు గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరాడు. దాంతో మురళీ విజయ్‌ను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేశారు. హర్భజన్‌ స్థానంలో కరణ్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు

చెన్నై

ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, సురేశ్‌ రైనా, సామ్‌ బిల్లింగ్స్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చాహర్‌, కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

రాజస్తాన్‌

అజింక్యా రహానే(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, సంజూ శాంసన్‌, బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, స్టువర్ట్‌ బిన్నీ, కృష్ణప్ప గౌతమ్‌, శ్రేయస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, బెన్‌ లాఫ్లిన్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top