భారత జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి!

KL Rahul Should have included in Indian team, Sourav Ganguly

ముంబై: న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు బ్యాటింగ్ లో చతికిలబడి ఓటమి చెందడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. భారత జట్టు పూర్తిస్థాయి బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగలేదనే వాదన వినిపిస్తోంది. ఇందుకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిస్తున్నాయి. దీనిలో భాగంగా గత కొన్ని మ్యాచ్ ల నుంచి కేఎల్ రాహుల్ ను పక్కకు పెట్టడాన్ని గంగూలీ  ప్రశ్నించాడు.ప్రధానంగా కివీస్ తో వన్డే సిరీస్ కు రాహుల్ ను ఎంపిక చేయకపోవడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'టీమిండియా  జట్టులో కేఎల్ రాహుల్ లేకపోవడం సరైన నిర్ణయం కాదు. అది నాకు పెద్దగా సంతోషాన్ని కూడా కల్గించలేదు. అతనొక భవిష్య ఆశాకిరణం. అటువంటప్పుడు రాహుల్ ను ఎందుకు పక్కన పెడుతున్నారు. అతను కచ్చితంగా  జట్టులో ఉండటం మంచిది. సాధ్యమైనంతం తొందరగా అతన్ని జట్టులో ఆడించే యత్నం చేయండి. అతను జట్టులో ఉన్న ప్రతీసారి పరుగులు చేస్తూనే ఉన్నాడు. భారత జట్టు గతంలో విదేశీ పర్యటలనకు వెళ్లినప్పుడు రాహుల్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో రాహుల్ ముఖ్యభూమిక పోషించాడు. అతన్ని తుది జట్టులో వేసుకోమని నా సలహా. టాలెంట్ ను పక్కకు పెట్టకుండా ప్రోత్సహించండి' అని గంగూలీ స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top