ఐపీఎల్‌: ఆటతోనే విమర్శలకు సమాధానం

Jadeja Answer For Critics With His Performance - Sakshi

కేకేఆర్‌ మ్యాచ్‌ అనంతరం జడేజాపై విమర్శలు

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన జడేజా

పుణే : జడేజాను జట్టు నుంచి తీసేయండి..! అసలు జట్టులో జడేజా పాత్ర ఏమిటి.? ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై వచ్చిన విమర్శలు. సీన్‌ కట్‌ చేస్తే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా బంతితో తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. తన ఆటతో విమర్శకులకు ధీటుగా సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన జడేజా.. అనంతరం మన్‌దీప్‌ సింగ్‌, హాఫ్‌ సెంచరీ సాధించిన పార్దీవ్‌ పటేల్‌లను పెవిలియన్‌ బాట పట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల పూర్తి కోట వేసిన జడేజా కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోని, కోచ్‌ ఫ్లెమింగ్‌ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

గురువారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జడేజా అనూహ్యంగా కోల్‌కతా ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ వరుస బంతుల్లో ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను వదిలేసి జట్టు ఓటమి కారణమయ్యాడు. ఈ ఓటమిని తట్టుకోలేని అభిమానులు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top