ఐర్లాండ్‌ ‘సూపర్‌’ విజయం

Ireland Won The Last T20 Match Against Afghanistan - Sakshi

అఫ్గానిస్తాన్‌తో చివరి టి20

గ్రేటర్‌ నోయిడా: అఫ్గానిస్తాన్‌ చేతిలో టి20 సిరీస్‌ కోల్పోయిన తర్వాత చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు విజయం దక్కింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా ఐర్లాండ్‌ నెగ్గింది. ముందుగా ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. డెలానీ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌), టెక్టర్‌ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెవిన్‌ ఓబ్రైన్‌ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. నవీన్, ఖైస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గానిస్తాన్‌ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే సాధించింది. రహ్మానుల్లా (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్గర్‌ అఫ్గాన్‌ (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అఫ్గాన్‌ జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 8 పరుగులు చేయగా...ఐర్లాండ్‌ వికెట్‌ నష్టానికి 12 పరుగులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన అఫ్గానిస్తాన్‌ 2–1తో సిరీస్‌ గెలుచుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top