ఐపీఎల్‌ ఆధారంగా ఎంపిక ఉండదు: కోహ్లి

IPL will have no bearing on World Cup selection, Kohli - Sakshi

హైదరాబాద్‌: వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించి భారత జట్టు ఎంపికలో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను ఏ మాత్రం ప్రామాణికంగా తీసుకోబోమని ఇప్పటికే భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప‍్రసాద్‌ స్పష్టం చేయగా, తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా అదే విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్‌ ఆధారంగా వరల్డ్‌కప్‌కు ఆటగాళ్లను ఎంపిక చేసే యోచన లేదన్నాడు. ఒకవేళ ఐపీఎల్‌ను ప్రామాణికంగా తీసుకుని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నాడు. వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుపై ఇప్పటికే స్పష్టత వచ్చిందన్న కోహ్లి.. ఒకవేళ తమ దృష్టిలో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించకపోతే వారు వరల్డ్‌కప్‌కు అనర్హులుగా అనుకోవడం కూడా పొరపాటేనని తెలిపాడు.

వరల్డ్‌కప్‌కు ఒక కచ్చితమైన జట్టుతో వెళ్తామనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్ని సమంగానే పరిశీలిస్తామని కోహ్లి తెలిపాడు. ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం బౌలర్‌ను తగ్గించే యోచన లేదన్నాడు. ఒకవేళ అలా చేస్తే అది కచ్చితంగా మంచి గేమ్‌ ప్లాన్‌ కాదన్నాడు. ప్రధానంగా బ్యాటింగ్‌ కాంబినేషన్స్‌పైనే దృష్టి సారించినట్లు కోహ్లి పేర్కొన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో స్సష్టత వచ్చిన నేపథ్యంలో ఎటువంటి మార్పులు తాను కోరుకోవడం లేదన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top