వన్డే సిరీస్‌కు స్టోక్స్‌ అనుమానం..!

Injured Ben Stokes in doubt for Australia ODIs - Sakshi

మెల్‌బోర్న్‌: త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టోక్స్‌.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఇటీవల నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టోక్స్‌ గాయపడ్డాడు. స్టోక్స్‌ గాయం తీవ్రమైనదిగా స్కానింగ్‌లో తేలడంతో అతని విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఫలితంగా పాకిస్తాన్‌తో రెండో టెస్టుకు స్టోక్స్‌ దూరమయ్యాడు.మరికొన్ని రోజుల్లో స్టోక్స్‌ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఆసీస్‌తో సిరీస్‌ ప్రారంభమయ్యే సరికి స్టోక్స్‌ కోలుకుంటేనే జట్టులో కొనసాగుతాడు. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జూన్‌ 13న ఓవల్‌లో తొలి వన్డే జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top