టీమిండియా ‘టాప్‌’ను నిలబెట్టుకోవాలంటే..

Indias No 1 ranking on the line in four match Test series - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంకును నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియాతో  సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే చాలు. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఆస్ట్రేలియా 4-0తో సిరీస్‌ గెలిస్తే టెస్టుల్లో అగ్రస్థానం చేరుకుంటుంది. భారత్‌ ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుంటే నంబర్‌ వన్‌ ర్యాంకుని కొనసాగిస్తుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌కు 116 పాయింట్లు ఉన్నాయి. ఆసీస్‌కు 102 పాయింట్లతో ఉంది. టీమిండియా 4-0తో సిరీస్‌ కైవసం చేసుకుంటే 120, ఆసీస్‌ 97 పాయింట్లకు చేరుకుంటాయి. ఈ ఫలితం తిరగబడితే కంగారూలు 110తో అగ్రస్థానానికి ఎగబాకితే కోహ్లిసేన 108తో మూడో స్థానానికి పడిపోతుంది. ఇక ఆసీస్‌ 3-0తో సిరీస్‌ గెలిస్తే 108, భారత్‌ 109 పాయింట్లతో ఉంటాయి. 

ఇక బ్యాట్స్‌మెన్‌ జాబితాలో విరాట్‌ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. తొలిసారి ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలని భావిస్తోంది. . ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉన్న ఆసీస్‌తో టీమిండియా నాలుగు టెస్టులు ఆడనుంది. మొదటి టెస్టు అడిలైడ్‌లో గురువారం(డిసెంబర్‌6) ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top