టీమిండియా వినూత్న ఫీల్డింగ్‌ డ్రిల్‌

Indian Cricket Teams New Round the Clock Fielding Drill - Sakshi

సౌతాంప్టన్‌: తమ ఫీల్డింగ్‌కు సంబంధించి మరింత మెరుగుదల సాధించేందుకు భారత క్రికెట్‌ జట్టు విన్నూత్న ప్రాక్టీస్‌ చేపట్టింది. ప్రధానంగా వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమించేందకు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌  ‘రౌండ్‌ ద క్లాక్‌’ పేరిట డ్రిల్‌ చేపట్టాడు. గురువారం సౌతాంప్టన్‌ చేరిన భారత జట్టు తీవ్రంగా సాధన చేసింది. ఇందులో ‘రౌండ్‌ ద క్లాక్‌’పై ఎక్కువగా దృష్టి సారించింది. 

ఇంతకీ ‘రౌండ్‌ ద క్లాక్‌’ ఏమిటంటే.. ఆరు విభిన్న ప్రాంతాల్లో ఫీల్డింగ్‌ చేస్తూ నాన్‌స్ట్రయికర్‌వైపు ఉండే వికెట్లను మొత్తం 20సార్లు పడగొట్టడం. 20సార్లు వికెట్‌ పడగొట్టడంలో సఫలమైన క్రికెటర్‌ను ఈ సెషన్‌నుంచి తప్పించారు. విఫలమైన క్రికెటర్‌తో మళ్లీమళ్లీ ప్రాక్టీస్‌ చేయించారు. ఇక ‘రౌండ్‌ ద క్లాక్‌’ డ్రిల్‌ అయ్యాక బంతిని సరైన దిశలో ఎలా వేయాలో అనే విషయాన్ని క్రికెటర్లకు శ్రీధర్‌ వివరించాడు. ఇక జట్టులో ఏకైక ఆఫ్‌ స్పిన్నర్‌ జాదవ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బౌలింగ్‌ చేయలేకపోయాడు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ డ్రిల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top