జట్టులో నుంచి యువరాజ్‌ అవుట్‌

జట్టులో నుంచి యువరాజ్‌ అవుట్‌


శ్రీలంకతో వన్డే, టీ-20 సిరీస్‌లకు బీసీసీఐ భారత్‌ జట్టును ప్రకటించింది. జట్టులో కోహ్లీ, శిఖర్‌ధావన్‌, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, రహానే, కేదార్‌ జాదవ్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌, చాహల్‌, బుమ్ర, భువనేశ్వర్‌, శార్ధుల్‌ ఠాకుర్‌లకు చోటుదక్కింది. రోహిత్‌ శర్మకు వైస్‌ కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఈ జట్టులో యువరాజ్‌కు చోటు దక్కకపోగా, షమీ, ఉమేష్‌ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నెల 20 నుంచి భారత్‌ శ్రీలంకతో ఐదు వన్డేలు ఆడనుంది.


ఆతిథ్య శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పల్లెకెలెలో జరుగుతోన్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 487 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, లంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 135 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ కోల్పోయి 19 పరుగులు చేసింది.

Back to Top