భారత్‌ ప్రత్యర్థి అర్జెంటీనా

India is rival Argentina - Sakshi

భువనేశ్వర్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌ టోర్నీలో అర్జెంటీనా, జర్మనీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనా 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. అర్జెంటీనా తరఫున లుకస్‌ విల్లా (21వ ని.), కెప్టెన్‌ మట్టియాస్‌ పరెడెస్‌ (29వ ని.), గిల్లార్డి (34వ ని.) గోల్స్‌ నమోదు చేయగా.. ఇంగ్లండ్‌ తరఫున డావిడ్‌ కాండొన్‌ (29వ ని.) ఆదమ్‌ (60వ ని.) గోల్స్‌ చేశారు. నెదర్లాండ్స్‌తో మరో క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్‌’ ద్వారా గెలిచి సెమీస్‌ చేరింది.

నిర్ణీత సమయంలో 3–3 తో ‘డ్రా’ కావడంతో ‘షూటౌట్‌’కు దారితీసింది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌లో 4–3తో జర్మనీ గెలుపొందింది. శుక్రవారం మొదటి సెమీస్‌లో జర్మనీతో ఆస్ట్రేలియా, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో భారత్‌ తలపడనున్నాయి.   సాయంత్రం 7:30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

Back to Top