పుజారా గోల్డెన్‌ డక్‌

India rattled as rahul, pujara depart early - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాపార్డర్‌ ఆటగాడు చతేశ్వర పుజారా గోల్డెన్‌ డక్‌గా అవుటయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించిన పుజారా రనౌట్‌గా నిష్ర్కమించాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్‌ మీదుగా ఆడాడు. అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు.

అవతలి ఎండ్‌ నుంచి మురళీ విజయ్‌ వద్దని వారిస్తున్నా పరుగు కోసం వెళ్లాడు. పరుగు కోసం నాన్‌ స్టైకింగ్‌ వైపు పరుగు పూర్తి చేసే క‍్రమంలో ఎంగిడి నేరుగా విసిరిన త్రో వికెట్లను పడగొట్టడంతో పుజారా భారంగా పెవిలియన్‌ చేరాడు. అయితే అంతకుముందు బంతికి ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (10; 21 బంతుల్లో 2×4) తొలి వికెట్‌గా అవుటయ్యాడు.  మోర్నీ మోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ మూడో బంతిని ఆడిన రాహుల్‌.. బౌలర్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Back to Top