టీమిండియా లక్ష్యం 245

India need 245 to win against England in Fourth Test - Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా 260/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇ‍న్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. మరో 11 పరుగులు మాత్రమే జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. బ్రాడ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, కరాన్‌(46) రనౌట్‌గా ఔటయ్యాడు. దాంతో భారత్‌కు 245 పరుగుల సాధారణ లక్ష్యం ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో షమీ నాలుగు వికెట్లు సాధించాడు.

ఈ రోజు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెంటనే వికెట్‌ను కోల్పోయింది.  మహ్మద్‌ షమీ వేసిన 92 ఓవర్‌ ఆఖరి బంతికి స్టువర్ట్‌ బ్రాడ్‌ పెవిలియన్‌కు చేరాడు. దాంతో షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసినట్లయ్యింది. అంతకుముందు ముందు రోజు 91 ఓవర్‌ ఐదో బంతికి ఆదిల్‌ రషిద్‌ను షమీ ఔట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top