కోహ్లిని ఔట్‌ చేసి ఊపిరి పీల్చుకున్నారు!

IND Vs NZ: Kohli Falls After 100 Run Stand - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు.  ఓపెనర్‌ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్థ శతకంతో మెరిశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఇష్‌ సోథీ వేసిన 29 ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.   

దాంతో భారత స్కోరు 156 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(32; 31 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, కోహ్లికి అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఫోర్ల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌పైనే దృష్టి పెట్టి రన్‌రేట్‌ కాపాడుకుంటూ వచ్చారు. కాగా, ఊహించని బంతిని సోథీ వేయడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. కోహ్లిని ఔట్‌ చేయడంతో న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకుంది. కోహ్లి ఔటైన తర్వాత అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: ఇద్దరికీ అరంగేట్రపు వన్డే.. కానీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top