'నేను తెల్లగా ఉంటే ఇంగ్లండ్ కు కెప్టెన్ అయ్యేవాడిని'

'నేను తెల్లగా ఉంటే ఇంగ్లండ్ కు కెప్టెన్ అయ్యేవాడిని'


లండన్: చాలా దేశాల్లో వర్ణ వివక్ష ఇప్పటికీ కొనసాగుతుందనేది కాదనలేని వాస్తవం.ఇది ఎక్కువగా అభివృద్ధిని దేశాలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. ఈ తరహా ఘటనలు క్రీడల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.  ఇదే తరహా అనుభవం ఇంగ్లండ్ పుట్బాల్ జట్టు తరుపున 73 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆర్స్నెల్ క్యాంబెల్ కు కూడా తప్పలేదు. తన మనసులో ఉన్న ఆవేదనను క్యాంబెల్ తాజాగా బయటపెట్టాడు. 'నేను తెల్లగా ఉండి ఉంటే ఇంగ్లండ్ జట్టుకు పదేళ్లకు పైగా  నాయకుడిగా కొనసాగేవాడినని' ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బ్లాక్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అధికశాతం మంది ఇంగ్లండ్ అభిమానులు బ్లాక్ ను తిరిగి జట్టు కెప్టెన్ కోరుకోవడం లేదన్నాడు.


 


తాను తెల్ల ఉంటే గనుక ఫుట్బాల్ అసోసియేషన్ కెప్టెన్ గా నియమించేదని క్యాంబెల్ తెలిపాడు. తనకు కెప్టన్ గా ఉండాల్సిన అర్హతలు అన్నీ ఉన్నా, తన వర్ణం కారణంగానే జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు దూరం అయ్యానన్నాడు. అండర్-18, అండర్ -21 స్థాయిల్లో నలుపు రంగు, తెలుపు రంగుల తారతమ్యాలు పెద్దగా కనిపించకపోయినా, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం వర్ణ వివక్ష ఎక్కువగా కనిపిస్తోందన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top