హైదరాబాద్‌కు రెండో పరాజయం

 రాణించిన సందీప్‌

 7 వికెట్లతో సౌరాష్ట్ర గెలుపు

 విజయ్‌ హజారే వన్డే టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: విజయ్‌ హజారే వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టును వర్షం వెంటాడుతోంది. వర్షానికి తోడు బ్యాట్స్‌మెన్‌ కూడా విఫలమవడంతో ఈ టోర్నీలో హైదరాబాద్‌ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ‘వీజేడీ’ పద్ధతిలో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 45 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆటను 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (5), పి. అక్షత్‌ రెడ్డి (7), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ కె. రోహిత్‌ రాయుడు (5) నిరాశ పరిచారు. ఈ దశలో కె. సుమంత్‌ (80 బంతుల్లో 47; 4 ఫోర్లు), బావనక సందీప్‌ (83 బంతుల్లో 76; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 95 పరుగులను జోడించారు. తర్వాత సుమంత్‌ వెనుదిరిగినా... ఆశిష్‌ రెడ్డి (11), ఆకాశ్‌ భండారి (17) అండతో సందీప్‌ మరిన్ని పరుగుల్ని జోడించాడు. జట్టు స్కోరు 162 వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్‌ ఉనాద్కట్‌ 4 వికెట్లతో చెలరేగాడు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ తర్వాత వర్షం పడటంతో సౌరాష్ట్ర లక్ష్యాన్ని 20 ఓవర్లలో 110 పరుగులుగా నిర్ణయించారు. సౌరాష్ట్ర 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాబిన్‌ ఉతప్ప (35; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అర్పిత్‌ (23 నాటౌట్‌), ప్రేరక్‌ మన్కడ్‌ (27 నాటౌట్‌) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ 2, ఆకాశ్‌ భండారి 1 వికెట్‌ దక్కించుకున్నారు.  

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ రనౌట్‌ 5; అక్షత్‌ (సి) మన్కడ్‌ (బి) ఉనాద్కట్‌ 7; రోహిత్‌ రాయుడు (సి) జాక్సన్‌ (బి) మన్కడ్‌ 5; సుమంత్‌ (సి) ఉతప్ప (బి) ధర్మేంద్రసిన్హ్‌ జడేజా 47; సందీప్‌ ఎల్బీ (బి) ఉనాద్కట్‌ 76; ఆశిష్‌ రెడ్డి (సి) మక్వానా (బి) ఉనాద్కట్‌ 11; ఆకాశ్‌ (సి) జాక్సన్‌ (బి) జాని 17; రవితేజ (సి) పుజారా (బి) ఉనాద్కట్‌ 9; సిరాజ్‌ రనౌట్‌ 5; మెహదీ హసన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (45 ఓవర్లలో 9 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1–11, 2–16, 3–22, 4–117, 5–156, 6–162, 7–180, 8–188, 9–196.

బౌలింగ్‌: ఉనాద్కట్‌ 8–1–33–4, చిరాగ్‌ 8–3–28–1, మన్కడ్‌ 6–1–23–1, కమ్లేశ్‌ 8–0–27–0, ధర్మేంద్ర సిన్హ్‌ 9–0–33–1, యువరాజ్‌ 6–0–44–0.
సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌: ఉతప్ప (స్టంప్డ్‌) సుమంత్‌ (బి) మెహదీహసన్‌ 35; జాక్సన్‌ ఎల్బీ (బి) భండారి 12; వ్యాస్‌ (సి) సందీప్‌ (బి) మెహదీ హసన్‌ 1; అర్పిత్‌ నాటౌట్‌ 23; మన్కడ్‌ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 110.

వికెట్ల పతనం: 1–56, 2–57, 3–62.
బౌలింగ్‌: రవికిరణ్‌ 4–1–20–0, సిరాజ్‌ 4–0–26–0, హసన్‌ 3–0–13–2, రవితేజ 1–0–9–0, భండారి 4–0–21–1, రోహిత్‌ రాయుడు 2.5–0–15–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top