భారత మహిళలకు రెండో గెలుపు

Harmanpreet Kaur all-round show - Sakshi

థాయ్‌లాండ్‌పై ఘన విజయం

హర్మన్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన 

కౌలాలంపూర్‌: ఆసియా కప్‌ మహిళల టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 17 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 27 పరుగులు చేయడంతో పాటు... బౌలింగ్‌లో 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది.

ఓపెనర్లు మోనా (32; 2 ఫోర్లు), స్మృతి (29; ఫోర్, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అనంతరం థాయ్‌లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 66 పరుగులు సాధించింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్‌ మాత్రమే రావడం గమనార్హం. చైవై (14; ఫోర్‌), బుచాథామ్‌ (21), సుతిరువాంగ్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత బౌలర్లలో దీప్తికి రెండు... పూనమ్, పూజాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top