మన పాండ్యా నెట్‌ ప్రాక్టీస్‌లో ఇలా..

Hardik Pandya ask the good length area on the pitch in net practice - Sakshi

సాక్షి: క్రికెటర్‌ హార్దిక్‌ పాం‍డ్యా ఆల్‌ రౌండర్‌ ప్రతిభతో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ-20 సిరిస్‌లో బాల్‌, బ్యాట్‌తో మెరుపులు కురిపించాడు.  పాండ్యా నేట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో పాండ్యా పిచ్‌పై గుడ్‌ లెంగ్త్‌ ఏరియాను అడిగి తెలుసుకుంటున్న విషయాన్ని గమనించవచ్చు. పాండ్యా తన 24వ బర్త్‌డేను అక్టోబర్‌ 11 న సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

మన ఆల్‌ రౌండర్‌కు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ విసెస్‌ను తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇక్కడ విశేషమేమంటే అక్టోబర్‌ 11నే బచ్చన్‌ జీ పుట్టిన రోజు కావడం. ‘నా పుట్టిన రోజును మీతో కలిసి సేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్తడే టు ఎవర్‌గ్రీన్‌​అని బచ్చన్‌ జీకు విసెస్‌ తెలిపాడు.  అమితాబ్‌, హర్దిక్‌ కలిసి ఉన్న ఫోటోలను పోస్టు చేశారు. పాండ్యాకు తన బ్రదర్‌ కృనాల్‌ పాండ్యా, టీం ఇండియా డ్యాసింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

గత కొంతకాలంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా-ఒక మిస్టరీ గర్ల్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు పాండ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ మేరకు తాజాగా ఆ మిస్టరీ  గర్ల్ ఎవరనే దానిపై ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. ఆ మిస్టరీ గర్ల్ తన చెల్లెలంటూ సోషల్ మీడియా వార్తలపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియాతో టీ-20 మ్యాచ్‌లను ఆడతుంది. రెండు జట్లు సిరిస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాయి.  హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఈ రోజు(13న) 3వ టి-20 మ్యాచ్‌ జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top