భజ్జీ పునర్జన్మ ప్రసాదించాడు: మాజీ క్రికెటర్‌

Harbhajan Singh  proved what true friendship means, Ex Cricketer Harman Harry - Sakshi

చండీగఢ్‌: వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఎంత సూటిగా మాట్లాడతాడో.. సాయం చేయడంలోనూ అలాగే ముందుంటాడు. తన చిన్ననాటి మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని తక్షణం ఆర్థిక సాయం అందించి ఆదుకున్నాడు. 1990 ప్రాంతంలో తనతో కలిసి అండర్‌-16 ఆడిన హర్మన్‌ హ్యారీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున‍్న భజ్జీ ఉదారతను చాటుకున్నాడు. ఆపరేషన్‌కు అవసరమైన రూ. 2.5 లక్షలు సమకూర్చాడు.

హర‍్మన్‌ ఆపరేషన్‌ చేయించుకోవడానికి తగినంత డబ్బు లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూడసాగాడు. సహాయం చేయాల్సిందిగా తన మిత్రుడైన హర్భజన్‌కు కూడా హర్మన్‌ విజ్ఞప్తి చేశాడు. తక్షణం స్పందించిన హర్భజన్‌.. శస్త్రచికిత్స అనంతరం హర్మన్‌ కోలుకుంటున్నాడు. భజ్జీ తనకు పునర్జన్మ ప్రసాదించాడని.. అతడు ఆదుకోకపోతే తాను బతికేవాడిని కాదని హర్మన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. నిజమైన స‍్నేహానికి హర‍్భజన్‌ అర్థం చెప్పాడని కన్నీటి పర్యంతమయ్యాడు. స్నేహితునికి సాయంపై హర్భజన్‌ స్పందిస్తూ.. ‘అతను నన్ను సంప్రదించిన తనకున్న సమస్య గురించి వివరించాడు. అతను డబ్బులేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను అతనికి వెంటనే అపరేషన్ చేయించుకోమని, వైద్యానికి అవరసమైన డబ్బు పంపిస్తానని చెప్పాను. జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని హర్భజన్ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top