రవిశాస్త్రిపై భజ్జీ విసుర్లు

Harbhajan Singh Comes Down Hard On Ravi Shastri - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత క్రికెట్‌ జట్టుపై ఇప‍్పటికే విమర్శల వర్షం తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం చేరిపోయాడు. ప్రధానంగా టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిని టార్గెట్‌ చేస్తూ భజ్జీ విమర్శలు గుప్పించాడు.

‘ ఈ రోజు కాకపోతే తర్వాతైనా భారత జట్టు ఓటమిపై కోచ్‌ రవిశాస్త్రి వివరణ ఇవ్వాల్సిందే. అతనే అందరికీ జవాబుదారీ. ఒకవేళ సిరీస్ ఓడిపోతే అతడు గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వాతావరణ పరిస్థితులనేవి కచ్చితంగా ఆటపై ప్రభావం చూపుతాయని అతను అంగీకరించాలి' అని హర్భజన్ అన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితుల్ని.. పిచ్ స్వభావాన్ని రవిశాస్త్రి లైట్ తీసుకున్నాడు. తాము ఏ జట్టుకు భయపడబోమని, టీమిండియా అత్యుత్తమ విదేశీ జట్లలో ఒకటని అన్నాడు. ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓడించే సత్తా భారత జట్టుకు ఉందని రవిశాస్త్రి అతి విశ్వాసం ప్రదర్శించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top