‘ముందుగా వెళ్లడం మంచిదే’

Going early will help Indian women's cricket team do well in Southafrica - Sakshi

ముంబై: ‘ప్రపంచకప్‌ సందర్భంగా ముందుగానే ఇంగ్లండ్‌ వెళ్లాం. అది జట్టుకు ఎంతో మేలు చేసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు త్వరగా వెళ్లడం కూడా ఉపయోగపడుతుంది’ అని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. మూడు వన్డేలు, ఐదు టి20లు ఆడేందుకు మిథాలీ సేన బుధవారం దక్షిణాఫ్రికా బయల్దేరనుంది.

ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ‘పిచ్‌లను అర్థం చేసుకుని, బౌన్స్‌ను ఎదుర్కొనేందుకు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు పనికొస్తాయి. ఈ తరహా పిచ్‌లు ఉపఖండంలో ఉండవు. తొలిసారిగా రెండు కొత్త బంతులతో ఆడబోతున్నందున ఇది ముఖ్యమైన సిరీస్‌’ అని మిథాలీ వివరించింది.  బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో సంభాషించడం చాలా ప్రయోజనకరం కానుందని విశ్లేషించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top