క్వార్టర్స్‌లో ఘనా, బ్రెజిల్‌

Ghana, Brazil in Quarter  final - Sakshi

నవీ ముంబై: ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఘనా, బ్రెజిల్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం ఇక్కడి డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఘనా 2–0తో నైజెర్‌పై విజయం సాధించింది. ఘనా కెప్టెన్‌ ఎరిక్‌ అయియా (45 + 4వ ని.) ఇంజ్యూరీ టైమ్‌లో గోల్‌ సాధించగా, రిచర్డ్‌ డాన్సో (90వ ని.) మ్యాచ్‌ చివరి నిమిషంలో గోల్‌ చేశాడు. కొచ్చిలో జరిగిన చివరి ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3–0తో హొండూరస్‌పై ఘనవిజయం సాధించింది.

బ్రెన్నెర్‌ (11వ ని., 56వ ని.) రెండు గోల్స్‌ చేయగా, అంటోనియా (44వ ని.) ఒక గోల్‌ సాధించాడు. 21న జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో మాలితో ఘనా; ఇంగ్లండ్‌తో అమెరికా... 22న జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇరాన్‌తో స్పెయిన్‌; జర్మనీతో బ్రెజిల్‌ తలపడతాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top