ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

Former India Physio Patrick Farhat Joins Delhi Capitals - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్‌... ఇకపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సేవలందించనున్నాడు. ఈ మేరకు అతడు మూడేళ్ల వ్యవధికి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫర్హార్ట్‌ ఇటీవలి ప్రపంచ కప్‌ వరకు భారత సీనియర్‌ జట్టుకు ఫిజియోగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్, ముంబై ఇండియన్స్‌కూ పనిచేసిన అనుభవం ఉన్న ఫర్హార్ట్‌... ఢిల్లీ ఫ్రాంచైజీకి సేవలందించడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆ జట్టు రెండు సీజన్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని గుర్తుచేశాడు. ఫర్హార్ట్‌ను తమ బృందంలో చేర్చుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసీవో ధీరజ్‌ మల్హోత్రా చెప్పాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top