వరల్డ్‌ కప్‌ మేనియా : టీవీలపై 60 శాతం తగ్గింపు

Flipkart World Cup Mania sale Get up to 60percent discount on Smart tvs - Sakshi

సాక్షి,  ముంబై:  ప్రస్తుతం ఎక్కడ  చూసినా ఐసీసీ వరల్డ్ కప్ 2019 హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ  ఫీవర్‌ను  క్యాష్‌ చేసుకునేందుకు ఆయా కంపెనీలు తమదైన రీతిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్ సేల్స్ ఆఫర్ చేస్తోంది. ‘వరల్డ్ కప్ మానియా’ పేరుతో జూన్ 13వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆఫర్ ఇస్తోంది. నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్స్‌లో షావోమీ, థామ్సన్, వూ, ఐఫాల్కన్ తదితర కంపెనీల టీవీలు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.  వీటితోపాటు ఎల్‌జీ, కొడాక్ తదితర కంపెనీల టీవీలు  కూడా డిస్కౌంట్‌లో  కొనుగోలు చేయవచ్చు.

అదనంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుతో పది శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా ఉంది.  అయితే ఈ ఆఫర్ కనీసం రూ.7,999 విలువ కలిగిన ట్రాన్సాక్షన్  చేయాల్సి ఉంది. కొనుగోలుదారులు గరిష్టంగా రూ. 2వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. 

షావోమీ స్మార్ట్ టీవీలు
32 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ  4ఏ ప్రొ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999 గా ఉంది.
43 అంగుళాల మోడల్ రూ.22,999కే అందుబాటులో  ఉంది. 
55 అంగుళాల మోడల్ టీవీ రూ.39,999గా ఉంది.  వీటితో  ఎంఐ టీవీ ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 వరకు ఉన్నాయి.

వూ అల్ట్రా స్మార్ట్ టీవీ
వూ స్మార్ట్‌టీవీ 33 శాతం డిస్కౌంట్‌తో రూ.17,999కి వస్తుంది. దీని అసలు ధర రూ.27,000.
32 అంగుళాల టీవీ రూ.11,999 
55 అంగుళాల హెచ్‌డీ టీవీ రూ.36,999
65 అంగుళాల మోడల్ టీవీ రూ.1,29,999.

ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలు
32 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు లభిస్తాయి. 
32 అంగుళాల మోడల్ రూ.11,999
75 అంగుళాల 4కేయూహెచ్‌డీ ప్రీమియం మోడల్ టీవీ రూ.1,49,999కు అందుబాటులో ఉంది.  దీంతోఆపటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌,  నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా  లభ్యం.

థామ్సన్ స్మార్ట్ టీవీ
థామ్సన్  యూడీ 9  40అంగుళాల టీవీ19,999 లకే లభిస్తోంది.  అసలు ధర మీద 28శాతం డిస్కౌంట్‌.
55 అంగుళాల ప్రీమియం మోడల్ రూ.33,999గా ఉంది.  ఫ్లిప్‌కార్ట్ వీటికి ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top