మహేంద్ర సింగ్ ధోని తొలిసారి..

 the first instance of Dhoni getting stumped in T20Is

గువాహటి: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ 20 టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గువాహటి వేదికగా ఇక్కడ బర్సపరా స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో విరాట్ సేనకు చేదు అనుభవమే ఎదురైంది. అటు బ్యాటింగ్ లో తొలుత విఫలమైన టీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకున్న ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది.  భారత్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది. దాంతో సిరీస్ ఫలితం కోసం మూడో టీ 20 వరకూ వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంచితే, మహేంద్ర సింగ్ ధోని(13) స్టంపింగ్ గా అవుటయ్యాడు. ఆడమ్ జంపా వేసిన 10 ఓవర్ ఐదో బంతికి ధోని స్టంప్ రూపంలో పెవిలియన్ చేరాడు. పదో ఓవర్ నాల్గో బంతిని ముందుకొచ్చి ఆడబోయి బతికిపోయిన ధోని.. ఆ మరుసటి బంతికే మరోకసారి ముందుకొచ్చి వికెట్ ను సమర్పించుకున్నాడు. తన కెరీర్ లో 80వ అంతర్జాతీయ ట్వంటీ 20 ఇన్నింగ్స్ ఆడుతున్న ధోని ఈ ఫార్మాట్ లో తొలిసారి స్టంపింగ్ రూపంలో నిష్క్రమించాడు. అటు విరాట్ కోహ్లి డకౌట్ గా నిష్ర్రమించడం టీ 20లో సరికొత్త రికార్డు అయితే, అదే ఫార్మాట్ లో ధోని తొలిసారి స్టంపింగ్ గా అవుట్ కావడం గమనార్హం.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top