నిద్రలోనే కన్నుమూసిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌!

 Fiorentina captain Davide Astori  dies in his sleep before Udinese game - Sakshi

రోమ్‌: ఇటలీకి చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు డావీ అస్టోరి మృత్యువాత పడ్డాడు. అతను బస చేస్తున్న హోటల్‌ గదిలోనే అస్టోరి మృతిచెందడం ఇటలీ ఫుట్‌బాల్‌ జట్టును ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. ప్రస్తుతం క్లబ్‌ జట్టైన ఫియోరెంటినాకు నాయకత్వం వహిస్తున్న 31 ఏళ్ల అస్టోరి నిద్రలోనే కన‍్నుమూసినట్లు సదరు క్లబ్‌ ట్వీట్‌ చేసింది.

అతను కార్డియక్‌ అరెస్ట్‌కు గురికావడంతోనే చనిపోయి ఉండవచ్చని ఫియోరెంటినా పేర్కొంది. యుడినెస్‌ జట్టుతో పోరుకు ముందు అస్టోరి మృత్యువాత పడటానికి అనారోగ్య సమస్యలే కారణంగా స్పష్టం చేసింది. ఇటలీ ఫుట్‌బాల్‌ జట్టు తరపున 14 మ్యాచ్‌లు ఆడిన అస్టోరి..2016లో ఫియోరెంటినా క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఫియోరెంటినా తరపున 58 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అతనికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు.  అయితే అస్టోరి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య ఫ్రాన్‌సెస్కాతో విభేదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక వార్తా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, అతని మృతిపై శవ పరీక్ష జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top