సెమీస్‌లో స్పెయిన్, బ్రెజిల్‌

FIFA U-17 World Cup: Brazil Pip Germany 2-1 to Reach Semi-final  - Sakshi

కొచ్చి: అజేయ ఆటతీరుతో చెలరేగిన ఇరాన్‌ జట్టుకు చెక్‌ పడింది. ఆదివారం జరిగిన ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో యూరోపియన్‌ చాంపియన్‌ స్పెయిన్‌ 3–1తో ఇరాన్‌ను చిత్తు చేసి సెమీఫైనల్లో ప్రవేశించింది. కెప్టెన్‌ అబెల్‌ రూయిజ్‌ (13వ నిమిషంలో), సెర్గియో గోమెజ్‌ (60), టోరెస్‌ (67) స్పెయిన్‌కు గోల్స్‌ అందించారు. ఇరాన్‌ నుంచి సయీద్‌ కరీమి (69) ఏకైక గోల్‌ చేశాడు.

మరో క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ జట్టు అద్భుత పోరాటంతో సెమీస్‌లో చోటు దక్కించుకుంది. ప్రథమార్ధం 21వ నిమిషంలోనే పెనాల్టీ కిక్‌ ద్వారా జాన్‌ ఫిటే ఆర్ప్‌ జర్మనీకి గోల్‌ అందించాడు. అయితే 71, 77వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించిన బ్రెజిల్‌ ఊపిరి పీల్చుకుంది. వెవర్‌సన్, పాలిన్హో ఈ గోల్స్‌ చేశారు. ఇక ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్‌లో బ్రెజిల్, ఇంగ్లండ్‌తో... స్పెయిన్‌ జట్టు మాలితో ఆడతాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top