ఇంగ్లండ్‌ చెత్త రికార్డు

england worst record after lose in perth test match - Sakshi

పెర్త్‌: యాషెస్‌ సిరీస్‌ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు ఒక చెత్త రికార్డును కూడా మూట గట్టుకుంది. ఒక వేదికపై అత్యధిక సార్లు వరుస టెస్టు ఓటముల చవిచూసిన జట్టుగా అపప్రథను సొంతం చేసుకుంది. ఒక వేదికపై వరుస ఓటముల పరంగా చూస్తే పెర్త్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఎనిమిదో ఓటమి. 1991-2017 మధ్య కాలంలో పెర్త్‌లో జరిగిన ప్రతీ టెస్టు మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ ఓటమి చెందింది. ఫలితంగా చెత్త రికార్డును మూటగట్టుకున్న ఇంగ్లండ్‌.. జింబాబ్వే సరసన నిలిచింది. గతంలో  జింబాబ్వే క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

మరొకవైపు ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగువందలకు పైగా పరుగులు చేసి ఇన‍్నింగ్స్‌ తేడాతో ఓటమి పాలైన చెత్త రికార్డును కూడా ఇంగ్లండ్‌ అత్యధిక సార్లు నమోదు చేసింది. ఇలా ఇంగ్లండ్‌ ఓటమి పాలు కావడం నాల్గోసారి కాగా, శ్రీలంక, పాకిస్తాన్‌లు తలో ఒకసారి పరాజయం చవిచూశాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top