వార్నర్‌కు అంత కోపమా.. ఆ మాటలెందుకు!

england ex cricketers fire on David Warner

ఆస్ట్రేలియా స్టార్‌​ క్రికెటర్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ చేసిన ‘యుద్ధం, ద్వేషం’ లాంటి వ్యాఖ్యలపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. వార్నర్‌ వ్యాఖ్యలకు ప్రధాన కారణం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా జరిగే యాషెస్‌.  క్రీడాస్ఫుర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగాలే తప్ప ఇతర జట్ల ఆటగాళ్లను శత్రువులుగా చూడటమేంటని మార్కస్‌ ట్రెస్కోథిక్‌ ప్రశ్నించారు.  వార్నర్‌ తీరును ఇంగ్లండ్‌ మాజీలు జెఫ్రీ బాయ్‌కాట్‌, మైకెల్‌ వాగన్‌ లు కూడా తప్పుపడుతున్నారు.  

వివాదానికి కారణమైన వార్నర్‌ వ్యాఖ్యలివే.. ‘యాషెస్‌ సిరీస్‌ మాకు గొప్ప చరిత్ర లాంటిది. మా ప్రతిష్ట ఈ సిరీస్‌తో ముడిపడి ఉంది. త్వరలోనే ఈ యుద్ధంలోకి దిగబోతున్నాం. ఇరుజట్లు కీలకంగా భావిస్తాయి కనుక.. ప్రత్యర్థి ఆటగాళ్లను సాధ్యమైనంతగా ద్వేషించాలి. ఆ జట్టు ఆటగాళ్లపై పైచేయి సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానంటూ’ వార్నర్‌ చెప్పడంపై ఇంగ్లండ్‌ మాజీలు భగ్గుమన్నారు. ఆటతో సంబంధాలు పెంచుకోవాలే తప్ప.. ద్వేషం, యుద్ధం అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని సీనియర్లు వార్నర్‌కు చురకలంటించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top