ఇంగ్లండ్‌ 184 ఆలౌట్‌

England collapse to 184 all out - Sakshi

బోర్డర్‌ సరసన అలిస్టర్‌ కుక్‌

లండన్‌: పాక్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ మెన్‌ తడబడ్డారు. లార్డ్స్‌లో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకే ఆలౌటైంది. కుక్‌ (70; 14 ఫోర్లు), స్టోక్స్‌ (38) ఫర్వాలేదనిపించారు. అబ్బాస్, హసన్‌ అలీ చెరో 4 వికెట్లు తీశారు.  అనంతరం పాకిస్తాన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది.

అజహర్‌ అలీ (10 బ్యాటింగ్‌), హారీస్‌ సోహైల్‌ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఈ టెస్టు ద్వారా ఇంగ్లండ్‌ ఓపెనర్‌ కుక్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా అత్యధిక టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ (153) సరసన చేరాడు. కుక్‌ కెరీర్‌లో ఇది 155వ టెస్ట్‌ మ్యాచ్‌ కాగా... వరుసగా 153వది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top