మోర్గాన్‌ మెరిసె...

England beat Pakistan by Seven Wickets - Sakshi

 పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ గెలుపు  

కార్డిఫ్‌: పాకిస్తాన్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ (42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హారిస్‌ సొహైల్‌ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన జోఫ్రా ఆర్చర్‌ 2 వికెట్లు తీశాడు.

తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (29 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. జో రూట్‌ (42 బంతుల్లో 47; 5 ఫోర్లు), మోర్గాన్‌ మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. పాక్‌ బౌలర్లలో వసీమ్, షాహిన్, హసన్‌ అలీ తలా ఒక వికెట్‌ తీశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top