నాకు క్రికెట్‌ అంటే ఇష్టం కాదు..!

Don't Like Cricket, Love It, David Warner - Sakshi

వార్నర్‌ మరో టిక్‌టాక్‌ వీడియో

ఫేవరెట్‌ షాట్స్‌తో  ఫ్యాన్స్‌కు చాలెంజ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ అయిపోయాడు.  కరోనా వైరస్‌తో ఎక్కడి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ అక్కడ స్తంభించిపోయిన వేళ వార్నర్‌ మాత్రం మంచి వినోదాన్ని అందిస్తున్నాడు. క్రికెట్‌లో ఏ తరహాలో షాట్లు కొట్టి అభిమానుల్ని పసందు చేస్తాడో, అదే తరహాలో వినోదాన్ని అందిస్తున్నాడు. కరోనా వైరస్‌ సంక్షోభంలోనే టిక్‌టాక్‌ అరంగేట్రం చేసిన వార్నర్‌.. ఇప్పుడు అందులో పెద్ద స్టార్‌ అయిపోయాడు. టిక్‌టాక్‌ చేయడానికి అనర్హం కానిది ఏదీ లేదన్నట్లు అన్నీ చేసేస్తున్నాడు వార్నర్‌. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?)

మొన్నటి వరకూ తెలుగు,తమిళ, హిందీ పాటలకు స్టెప్పులేసిన వార్నర్‌.. ఇప్పుడు బ్యాట్‌ పట్టాడు. క్రికెట్‌ బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని పలు రకాల షాట్స్‌ ప్రాక్టీస్‌ చేసేశాడు. తన ఫేవరెట్‌ షాట్లైన రివర్స్‌ స్వీప్‌,  ఆన్‌ డ్రైవ్‌, స్విచ్‌ హిట్‌, స్లాగ్‌ షాట్‌లు ఆడేసి టిక్‌టాక్‌లోకి అప్‌ లోడ్‌ చేశాడు. ఇక అదే పనిగా ఆ షాట్లు ఆడమని ఫ్యాన్స్‌ చాలెంజ్‌ కూడా విసిరాడు వార్నర్‌. దీనికి ఒక ఆసక్తికరమైన  కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు వార్నర్‌. ‘ నాకు క్రికెట్‌ అంటే ఇష్టం కాదు.. ఆ గేమ్‌ అంటే ప్రేమ’ అని క్యాప్షన్‌  ఇచ్చాడు. ఈ షాట్స్‌ను ట్రై చేయమని కూడా అభిమానుల్ని కోరాడు.అంతకుముందు వార్నర్‌ పలు టిక్‌టాక్‌ వీడియోల్ని చేశాడు. వాటిలో బుట్టబొమ్మ సాంగ్‌తో పాటు  పోకిరి సినిమాలో ఒక డైలాగ్‌  చెబుతూ చేసిన వీడియోలు హైలైట్‌ అయ్యాయి. రీసెంట్‌గా ‘అమరేంద్ర బాహుబలి’ అనే డైలాగ్‌ చెప్పడంతో పాటు, ప్రేమికుడు సినిమాలోని ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్‌ చేశాడు. తన భార్య క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేశాడు. (ముక్కాల ముక్కాబులా అంటున్న వార్నర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top