‘దినేశ్‌ కార్తీక్‌ను ఓపెనర్‌గా తీసుకోండి’

 Dinesh Karthik could be Indias 3rd opener in World Cup, Gavaskar - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే భారత క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు ఓపెనర్లగా సేవలందిస్తుండగా, మూడో ఓపెనర్‌గా దినేశ్‌ కార్తీక్‌ను పరీక్షించాలని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. అది కూడా వరల్డ్‌కప్‌లో మూడో ఓపెనర్‌గా దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోని ఉన్న నేపథ్యంలో దినేశ్‌ కార్తీక్‌ వరల్డ్‌కప్‌ స్థానం అంతంత మాత్రంగా ఉంది. ఒకవైపు రిషభ్‌ పంత్‌ నుంచి కూడా పోటీ నెలకొన్న తరుణంలో దినేశ్‌ వరల్డ్‌కప్‌ బెర్తుపై టీమిండియా తర్జన భర‍్జనలు పడుతోంది. అయితే దినేశ్‌ కార్తీక్‌ను వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కల్పిస్తూనే ఓపెనర్‌గా పరీక్షించాలని గావస్కర్‌ పేర్కొన్నాడు.

‘నేను వరల్డ్‌కప్‌లో దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా చూడాలనుకుంటున్నా. వరల్డ్‌కప్‌లో ఇద్దరు రెగ‍్యులర్‌ ఓపెనర్లకు సాయంగా మరొకర్ని జట్టు అట్టిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు దినేశ్‌ కార్తీక్‌ సరైన వాడనేది నా అభిప్రాయం. టెస్టుల్లో  ఓపెనర్‌గా దినేశ్‌ సేవలందించడాన్ని గతంలో చూశాం. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు సందర్భాల్లో మ్యాచ్‌ ఫినిషర్‌గా దినేశ్‌ ఆట తీరును కూడా వీక్షించాం. వీటిని దృష్టిల్లో పెట్టుకుని వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా రిజర్వ్‌లో పెట్టుకోవడమే ఉత్తమం’ అని గావస్కర్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top