ఓటమిపై స్పందించిన ధోని

Dhoni Comments After CSK Lost Match To Mumbai Indians - Sakshi

ముంబై : ఐపీఎల్‌ 12వ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలిసారి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సమిష్టి కృషితో రాణించిన ముంబై ఇండియన్స్‌.. 37 పరుగుల తేడాతో చెన్నైపై జయభేరి మోగించింది. దీంతో సీఎస్‌కే జోరుకు బ్రేక్‌ పడింది. ఈ క్రమంలో సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోని మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘ 10- 12 ఓవర్ల దాకా ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేశాం. అయితే డెత్‌ ఓవర్లలో మాత్రం మా ఆటగాళ్లు గొప్పగా బౌల్‌ చేయలేకపోయారు. అదే విధంగా కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్‌, బలమైన బౌలింగ్‌ టీమ్‌ లేకపోవడం మా విజయావశాలను దెబ్బతీసింది. ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో మా బౌలర్లు విఫలమయ్యారు’ అని ధోని చెప్పుకొచ్చాడు.

చదవండి : (చెన్నై జోరుకు చెక్‌ పెట్టిన ముంబై)

అదే విధంగా... జట్టు సభ్యులందరితో ఒకేసారి కాకుండా.. ఒక్కో ఆటగాడితో కూర్చుని మాట్లాడితేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని భావిస్తున్నట్లు ధోని వ్యాఖ్యానించాడు. ‘బ్రావోను గాయం వేధిస్తోంది. ఇక మరికొంత మంది ఆటగాళ్లు గాయాల కారణంగా ఇప్పటికే మ్యాచ్‌కు దూరమయ్యారు. డేవిడ్‌ విల్లీ లేడు. అదే విధంగా లుంగీ ఎంగిడి కూడా జట్టుతో లేడు. రానున్న మ్యాచ్‌లలో సరైన కాంబినేషన్లు సెట్‌ చేసి విజయాలు సాధిస్తాం’ అని ధోని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా బుధవారం నాటి మ్యాచ్‌లో తొలుత ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 1 నుంచి 18 ఓవర్ల వరకు ముంబై చేసిన స్కోరు నామమాత్రమే(125/5). అటువంటి తరుణంలో క్రీజులో ఉన్న హార్దిక్‌ పాండ్యా–పొలార్డ్‌ జోడి కేవలం రెండు ఓవర్లలో 45 పరుగులు చేసి.. తమ బౌలర్లు పోరాడేందుకు, లక్ష్యాన్ని కాపాడేందుకు అవసరమైన స్కోరు అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top