‘స్మిత్, వార్నర్‌లపై నిషేధాన్ని సడలించం’

David Warner, Steve Smith ban will stand, CA says ahead of India series - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లపై విధించిన నిషేధాన్ని సడలించే ప్రసక్తే లేదని ఆ దేశ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. గతంలో వారిపై తాము విధించిన సస్పెన్షకే కట్టుబడి ఉంటామని పేర్కొంది. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొంటున‍్నారు. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధాన్ని విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది.
 

కాగా, టీమిండియాతో వచ్చేనెలలో సిరీస్‌ ఆరంభంకానున్న తరుణంలో ఈ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధాన్ని సడలించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా వారిపై నిషేధాన్ని సమీక్షించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నుంచి విన్నపాలు వచ్చిన నేపథ్యంలో సీఏ స్పందించింది. వారిపై నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని సీఏ ప్రకటించింది. స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుండగా, బాన్‌క్రాఫ్ట్ పై నిషేధం జనవరిలో తొలగనుంది.

అందుకే ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు: స్టీవ్‌ వా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top