అరంగేట్రంలోనే రెండు రికార్డులు!

cricketer Aiden Markram two records at debuts

ఈస్ట్‌ లండన్‌: అరంగేట్రంలోనే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్‌క్రమ్‌ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగుతున్న మూడో వన్డే ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సఫారీ ఆటగాడు మార్‌క్రమ్ (60 బంతుల్లో 66, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా టెస్ట్‌, వన్డే అరంగేట్ర మ్యాచ్‌లలో అర్ధ శతకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా రెండో క్రికెటర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ హాఫ్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇలా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఆటగాడు డుప్లెసిస్.

టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో రనౌట్ అయిన దక్షిణాఫ్రికా తొలి క్రికెటర్‌గానూ ఎయిడెన్ మార్‌క్రమ్ నిలిచాడు. ఇటీవల టెస్ట్ అరంగేట్రంలోనూ హాఫ్ సెంచరీ అనంతరం రనౌట్ అయిన మార్‌క్రమ్, నేడు బంగ్లాదేశ్‌తో జరగుతున్న మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీ చేసి రనౌటయ్యాడు. లేని పరుగుకు యత్నించిన మార్‌క్రమ్‌ బంగ్లా ఫీల్డర్ ఇమ్రూల్ క్యోస్ అద్భుత త్రోకు రనౌట్ అయి నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.

ఓవరాల్‌గా టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో రనౌట్ అయిన నాలుగో క్రికెటర్ మార్‌క్రమ్. గతంలో బాసిల్ డి ఓలివేరా, బ్రియాన్‌ ల్యూక్‌హర్స్ట్‌, సులేమాన్‌ బెన్ రెండు ఫార్మట్లలో తొలి మ్యాచ్‌లలో రనౌట్ అయిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top