మా స్పిన్నర్లతో భారత్‌కు సవాలే! 

Challenging to India with our spinners - Sakshi

అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ అస్ఘర్‌ స్తానిక్‌జై

న్యూఢిల్లీ: తమ జట్టులోని ప్రపంచ స్థాయి స్పిన్నర్లు... భారత బ్యాట్స్‌మెన్‌కు కఠిన సవాలు విసురుతారని అంటున్నాడు అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ అస్ఘర్‌ స్తానిక్‌జై. వచ్చే నెల 14న బెంగళూరులో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ ద్వారా అఫ్గాన్‌ టెస్టు అరంగేట్రం చేయనుంది. విరాట్‌ కోహ్లి ఉన్నా లేకున్నా టీమిండియా గొప్ప జట్టేనని, స్వదేశంలో మరింత బాగా ఆడుతుందని, వారికి గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. ‘ఇది చక్కటి అనుభవం. విజయం కోసమే ఆడతాం. స్పిన్నర్లు రషీద్‌ ఖాన్, ముజిబుర్‌ మా బలమైనా, దౌలత్, షాపూర్‌ జద్రాన్‌ వంటి మంచి పేసర్లూ ఉన్నారు.

అఫ్గాన్‌ వికెట్లు భారత్‌లోలానే స్పిన్‌కు అనుకూలం. మాకు చాలినంత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అనుభవం ఉంది. సవాల్‌ను ఎదుర్కొంటాం. కోహ్లి ఉంటే అతడికి ప్రత్యర్థిగా ఆడటాన్ని మరింత ఆస్వాదించేవాళ్లం’ అని అస్ఘర్‌ అన్నాడు. ప్రస్తుతం అఫ్గాన్‌ జట్టు గ్రేటర్‌ నోయిడాలో సాధన చేస్తోంది. అరంగేట్ర టెస్టుకు ముందు వచ్చే నెల 3, 5, 7 తేదీల్లో బంగ్లాదేశ్‌తో డెహ్రాడూన్‌లో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తలపడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top