సిరాజ్ ఎంట్రీపై బూమ్రా స్పందన

Bumrah backs rookie pacer Siraj to do well in future - Sakshi

రాజ్కోట్: న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా రెండో టీ 20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ కు యువ సంచలనం జస్ఫ్రిత్ బూమ్రా మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్ తో టీ 20 మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సిరాజ్ కు మంచి భవిష్యత్తు ఉందని బూమ్రా అభిప్రాయపడ్డాడు.

'ఇది సిరాజ్ కు మొదటి మ్యాచ్.  బౌలింగ్ కు పెద్దగా అనుకూలించని ఒక కష్టసాధ్యమైన వికెట్ పై బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. అది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. సిరాజ్ నుంచి అప్పుడే అత్యున్నత స్థాయి ప్రదర్శన ఆశించకూడదు. బౌలర్ గా అతను జట్టులో నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వాలి. ప్రస్తుతం సిరాజ్ నేర్చుకునే దశలోనే ఉన్నాడు. అతను చేసిన తప్పులను తెలుసుకుని గాడిలో పడటానికి సమయం పడుతంది. తొలి మ్యాచ్ లో అతని ప్రదర్శన తదుపరి మ్యాచ్ కు గుణపాఠం కావాలి. సిరాజ్ కు మంచి భవిష్యత్తు ఉందనే అనుకుంటున్నా'అని బూమ్రా తెలిపాడు. తన తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ వేసిన సిరాజ్ వికెట్ తీసి 53 పరుగులిచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top