ఆ హీరోయిన్ కాదు: భువనేశ్వర్

ఆ హీరోయిన్ కాదు: భువనేశ్వర్


ముంబై:'వంకాయ ఫ్రై' హీరోయిన్ అనుస్మృతీ సర్కార్ తో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను భారత క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఖండించాడు. అనుస్మృతీతో  డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో వాటిపై భువీ స్పందించాడు. తనకు అనుస్మృతీకి ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా భువనేశ్వర్ పేర్కొన్నాడు. అయితే ఎవరితో డేటింగ్ చేస్తున్నానో త్వరలోనే చెబుతానని మరో ఝలక్ ఇచ్చాడు. దానికి సరైన సమయం కావాలంటూ అభిమానుల్లో మరొకసారి ఆసక్తిని రేకిత్తించాడు భువీ.  

భువనేశ్వర్ కుమార్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వాడివేడి చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోకు 'డిన్నర్ డేట్' అనే క్యాప్షన్ పెట్టడంతో భువీ డేటింగ్ చేసే అమ్మాయి ఎవరో అనే ఉత్సుకత అభిమానుల్లో రేగింది. నగరంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంలో చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను గత కొన్ని రోజుల క్రితం అప్ లోడ్ చేశాడు భువి. దానికి డిన్నర్ డేట్ అని క్యాప్షన్ తగిలించాడు. క్కడ కేవలం భువీ మాత్రమే ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే ఫుల్ పిక్చర్ ను చూస్తారంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దాంతో భువీ.. ఆ అమ్మాయి ఎవరు? అంటూ అభిమానులు తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే ఆ అమ్మాయి అనుస్మృతీ సర్కార్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు బెంగాలీ సినిమాలతో పాటు తెలుగులో వంకాయ ఫ్రైలో  నటించి బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అనుస్మృతీ సర్కార్ అనే ప్రచారం జరిగింది.  దానికి తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు భువీ. 'నేను డేటింగ్ చేసేది మీరు అనుకుంటున్న అమ్మాయి కాదు' అని ముగింపు పలికాడు. మరి ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అనే దాని గురించి ఇక భువీని చెప్పాలి.

Back to Top