ముందుగా వన్డేలాడినా లాభం లేదు!

BCCI has not marketed Test cricket well: Gautam Gambhir - Sakshi

ఇంగ్లండ్‌ పర్యటనపై గంభీర్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనలో కొత్తగా టెస్టులకు ముందు వన్డేలు, టి20లు ఆడితే వచ్చే ప్రయోజనమేమీ లేదని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఇంగ్లండ్‌లో టెస్టులు ఎరుపు డ్యూక్‌ బంతులతో ఆడాల్సి ఉంటుందని...దానికంటే ముందు తెలుపు బంతితో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడటం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదని అతను అభిప్రాయ పడ్డాడు. నిజానికి చాలా కాలంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెస్టులను సరిగ్గా పట్టించుకోలేదని గౌతీ అన్నాడు. ‘బోర్డు ఐపీఎల్‌ను విశ్వవ్యాప్తం చేసింది. వన్డేలు, టి20లకు ప్రేక్షకాదరణ తెచ్చింది. కానీ సంప్రదాయ క్రికెట్‌ టెస్టులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదురోజుల ఆటను ఆశించిన స్థాయిలో మార్కెటింగ్‌ చేయడం లేదు’ అని అన్నాడు.

2011లో ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఉదహరిస్తూ... ‘దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్‌లు ఆడుతున్న టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు కేవలం వెయ్యి మంది వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించండి’ అని వివరించాడు.    మరోవైపు భారత్‌ ‘డేనైట్‌’ టెస్టు ఆడాలని హర్భజన్‌ సూచించాడు. ‘డేనైట్‌ టెస్టుల్ని భారత్‌ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్‌ బాల్‌ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top