బంతి దెబ్బకు మరో క్రికెటర్‌ మృతి...

Bangladeshi boy dies at 17 after being hit by cricket ball

ఢాకా: క్రికెట్‌ బంతికి మరో గల్లీ క్రికెటర్‌ బలయ్యాడు. బంగ్లాదేశ్‌లోని రఫికుల్‌ ఇస్లామ్‌(17) అనే యువకుడు అంపైరింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ కొట్టిన షాట్‌  తగిలి మైదానంలో కుప్పకూలాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢాకాలోని బాలుర్‌ మత్‌ మైదానంలో కొంత మంది యువకులు కలిసి క్రికెట్‌ ఆడుతున్నారు. రఫికుల్‌ అంపైరింగ్‌ చేస్తుండగా బ్యాట్స్‌మెన్‌ ఆడిన షాట్‌ నేరుగా అతని చాతికి తగిలింది.

ఆ దెబ్బకు రఫికుల్‌ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సమీప ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ మరణం ఎంతటి విషాదం నింపిందో అందరికి తెలిసిందే.  అయితే రఫిక్‌ది చాల నిరుపేద కుటుంబమని, అతని తండ్రి రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడని, ఢాకా పోలీసులు తెలిపారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top