ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ విజేత ఖతర్‌ 

Asia Cup football winner Qatar - Sakshi

అబుదాబి: తమకంటే మెరుగైన జట్టు, నాలుగు సార్లు చాంపియన్‌ అయిన జపాన్‌కు షాకిస్తూ ఖతర్‌ జట్టు తొలిసారి ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ విజేతగా నిలిచింది. శుక్రవారం ఇక్కడ ఒకింత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఖతర్‌ 3–1తో జపాన్‌ను ఓడించింది.

మ్యాచ్‌ 12వ నిమిషంలో  అల్మొయిజ్‌ అలీ కళ్లుచెదిరే బైస్కిల్‌ కిక్‌తో ఖతర్‌కు తొలి గోల్‌ అందించాడు. అబ్దుల్‌ అజీజ్‌ హటెమ్‌ 27వ నిమిషంలో మరో గోల్‌ సాధించి జట్టును 2–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రెండో భాగంలో టకుమి మినామినో (69వ ని.) జపాన్‌ ఖాతా తెరిచాడు. అయితే, అక్రమ్‌ అఫిఫ్‌ (83వ ని.) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ఖతర్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top