సైనాకు అనుష్క ప్రత్యేక కానుక..!

 Anushka Sharma special gift for Saina Nehwal - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ షిప్ లో ఇటీవల విజయం సాధించిన ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక కానుక పంపారు. ‘నుష్’ పేరుతో టెక్స్ టైల్ వ్యాపార రంగంలోకి అనుష్క అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

తమ సంస్థకు చెందిన కొన్ని వస్త్రాలను అందమైన ప్యాక్ లో ఉంచి వాటిని కానుకగా సైనాకు పంపారు. ఈ విషయాన్ని సైనా తన ట్విట్టర్లో తెలిపారు. ‘అనుష్క శర్మకు ధన్యవాదాలు. ఈ దుస్తులను త్వరలోనే ధరిస్తా. ‘నుష్’ సంస్థ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మీకు శుభాకాంక్షలు’ అని సైనా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top