‘విరుష్క’ ముద్దూ ముచ్చట!

Anushka Sharma kisses Virat Kohli's hand as he misses father at Delhi event - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కలిసి ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టీ వారిపైనే ఉంటుంది. అది విదేశాల్లో బీచ్‌ అయినా... భారత్‌లో అధికారిక కార్యక్రమమైనా!  అయినా సరే ఈ జంట తమ ప్రేమను ప్రదర్శించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గుతున్నట్లు లేదు. తాజాగా ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస్తూ నిర్వహించిన కార్యక్రమంలో కూడా వీరిద్దరి ముద్దూ ముచ్చట అందరినీ ఆకర్షించింది. ఒకవైపు కార్యక్రమం సాగుతుండగా... మరోవైపు అనుష్క తన భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా ముద్దాడుతున్న వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. గురువారం నుంచి ఈ దృశ్యాలు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై ‘చూడముచ్చటైన జోడి’ అంటూ కొందరు అభిమానం ప్రదర్శించగా, మరికొందరినుంచి అనేక వ్యంగ్య వ్యాఖ్యానాలూ వినిపించడం విశేషం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top